Feb 18,2023 12:11

ఢిల్లీ : మార్చి 4 నుంచి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం కానుంది. తొలి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో స్మృతి మంధానను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. కాగా స్మృతి మంధానను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో స్మృతి మంధాన కెప్టెన్‌గా ఎంపికైన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. స్మృతికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్‌లో షేర్‌ చేసింది.
ఈ విషయంపై స్పందించిన స్మృతి మంధాన.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్‌.. విరాట్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుంది. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.