- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ సి హెచ్ సుప్రజ
ప్రజాశక్తి-మైలవరం : గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు మైలవరం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ సి హెచ్ సుప్రజ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లు నిండాయని, వందలాదిమంది నాయకుల త్యాగాల ప్రతిఫలం ఈ స్వాతంత్రం అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు ఊరు వాడల జరిగేలా కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దాఖలు లేవని చెప్పారు. కానీ వేలాదిమంది కార్మికులు నాయకులు పోరాటాల ఫలితమే భారత దేశ స్వాతంత్రం అని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, కార్మికులను విస్మరిస్తుందని, ప్రజాస్వామ్య విలువలను పాతి పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, మండల కమిటీ సభ్యులు ప్రత్తిపాటి జ్యోతి, వేముల వెంకయ్య, నాగేశ్వరరావు, గంట సాంబయ్య, విజయ్, సురేష్, వేముల శ్రీను, స్వర్ణ, వెంకమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు










