ప్రజాశక్తి - విజయవాడ : జిల్లాలో జరుగుతున్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ అధికారుల ను ఆదేశించారు.జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న రెండవ దశ రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో రాళ్లు పాతే ప్రక్రియను మంగళవారం జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్ విజయవాడ రూరల్ మండలం షాబాద్ గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెండవ దశ రీ సర్వేలో వివిధ దశలు పూర్తి అయిన గ్రామాలలో స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీ సర్వే మొదటి దశలో జిల్లాలో 14 గ్రామాల్లో విజయవంతమైందని ఇదే స్ఫూర్తితో రెండవ దశ రీసర్వ్ కూడా రెవెన్యూ, సర్వే అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు.స్టోన్ ప్లాంటేషన్ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ తో పాటు రూరల్ తహశీల్దార్ జాహ్నవి, రెవెన్యూ ,సర్వే అధికారులు ఉన్నారు.










