Mar 28,2022 12:04

శృంగవరపుకోట (విజయనగరం) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ... నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం శృంగవరపుకోట పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ర్యాలీలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, ఆశాలు, మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌, క్వారీ కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు.పాల్గొన్నారు.