అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్
స్పందన అర్జీలను
జవాబుదారి తనంతో పరిష్కారం
-కలెక్టర్ హరి నారాయణన్
నెల్లూరు:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్పందన కార్యక్రమంలో ఏ ఒక్క అధికారి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకుండా జవాబుదారి తనంతో పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్‌అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి కలెక్టర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావతం కాకుండా సంతప్తికర స్థాయిలో నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పరిష్కరించిన అర్జీలు మరలా వస్తున్నాయని అలాంటి అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కారం చేయగలిగినవి చేయాలన్నారు. ఎక్కువగా ప్రజా సమస్యలు వచ్చే శాఖలైన సాంఘిక సంక్షేమం, బిసి., ఎస్.సి., ఎస్.టి., మైనారిటీ, మహిళా సంక్షేమం, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ, జిల్లా పంచాయతీ అధికారి,విద్య, వైద్య ఆరోగ్య శాఖ, మైన్స్, సర్వే, మునిసిపల్, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. ఆర్.డబ్ల్యూ ఎస్., ఆర్ అండ్ బి., పంచాయతీ రాజ్,ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు, అగ్నిమాపక, అటవీశాఖ, వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల అధికారులు ప్రతి సోమవారం వారి కార్యాలయంలోనే అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి,ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలను ప్రజల వద్ద నుండి స్వీకరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నుడా విసి టి. బాపిరెడ్డి, జడ్పీ సీఈవో బి.చిరంజీవి, డి ఆర్ డి ఏ,మెప్మా, గహ నిర్మాణసంస్థ పీడీలు సాంబశివరెడ్డి, రవీంద్ర, వెంకట దాసు, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా విద్యా శాఖ అధికారి గంగాభవాని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పెంచలయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్.ఈ కష్ణమోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి కనకదుర్గా భవాని తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి దాతల విరాళం
నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నడపబడుచున్న క్యాన్సర్ ఆస్పత్రి లో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి తమ వంతు సాయంగా నగరవాసులు మునగా వరలక్మి తన భర్త జ్ఞాపకార్థం రూ.10లక్షలు చెక్కును, పావులూరు మాలకొండయ్య, మహాలక్ష్మి రూ. 5 లక్షలు చెక్కును కలెక్టర్ ఎం. హరినారాయణన్ కు స్పందన కార్యక్రమంలో అందజేసారు. చెక్కులను అందచేసిన దాతలతో క్యాన్సర్ ఆసుపత్రి ఎంసి సభ్యులు రంగయ్య నాయుడు, డా.నాగేశ్వరరావు, డా. లక్ష్మీ పాల్గొన్నారు.










