Sep 23,2023 20:28

దంత పరీక్షలు చేస్తున్న డాక్టర్‌

దంత పరీక్షలు చేస్తున్న డాక్టర్‌
సమస్యలను ఎదుర్కొనేందుకు పెన్షనర్లు ఐక్యం కావాలి
-మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం
ప్రజాశక్తి-నెల్లూరు:భవిష్యత్తు కాలంలో రాబోవు సమస్యలను ఎదుర్కొనేందుకు పెన్షనర్లు అందరూ సంఘటితం కావాలని మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక భక్తవత్సలనగర్‌ ప్రాంతంలోని పెన్షనర్‌ భవన్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఎస్‌ఎం గౌస్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం , ఇందిరా మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల అధినేత డాక్టర్‌ కె.వివేకానందరెడ్డిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలను మాజీ ఎంఎల్‌సి దృష్టికి తీసుకొచ్చారు
. అనంతరం పెన్షనర్లకు దంత వైద్యపరీక్షలు నిర్వహించారు. డాక్టరు వివేకానందరెడ్డి మాట్లాడుతూ దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణయ్య, జిల్లా శాఖ కోశాధికారి జె.హజరత్తయ్య, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు ఎన్‌.శ్రీనాద్‌, అర్గనైజింగ్‌ సెక్రటరీ సిహెచ్‌ రఘునాద్‌, రాష్ట్ర సెక్రటరీ ఎస్‌.మాలకొండయ్య, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఈసి సభ్యులు పాల్గొన్నారు.