Apr 17,2023 21:53

ప్రజలతో మాట్లాడుతున్నఎంఎల్‌ఎ

ప్రజాశక్తి-వలేటివారిపాలెం :అంకభూపాలపురంలో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి సూచించారు. ఆ గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, అంకభూపాలపురం గ్రామాల్లో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందిన తీరు గురించి మాట్లాడారు. ఇంకా ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో సిబ్బందితో మాట్లాడారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందన్నారు. విద్యుత్‌ స్తంభాలు మరమ్మత్తులకు గురయ్యాయని, వెంటనే చేయించాలని bఇకి సూచించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.15 లక్షలు, అంకభూపాలపురం నుంచి వలేటివారిపాలెం వరకు వెళ్లే రోడ్డు మరమ్మత్తులకు రూ.15 లక్షలు నిధులు కేటాయించనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి ఇంటూరి భారతి, bంపిపి పొనుగోటి మౌనిక, గ్రామసర్పంచ్‌ ప్రగడ ఆదిలక్ష్మి, వైసిపి నాయకులు బాపతు మాలకొండారెడ్డి, బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి, ప్రగడ వెంకటేశ్వర్లు ఉన్నారు.