Mar 27,2022 00:03

ప్రజాశక్తి-చీరాల: కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో నాయకులు శనివారం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తూ.. శ్రామికుల హక్కులను హరిస్తూ.. కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వసంతరావు, డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో సంపదను సష్టించే కార్మికుల సమస్యలను గాలికొదిలేశాయని, ఇప్పటికైనా కార్మికులు, ప్రజలు దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని నిరసన తెలపాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.బాబూరావు, ఎల్‌. జయరాజు, నారపరెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యమూర్తి, సల్మాన్రాజు, పోతురాజు, వెంకటేష్‌, ఏఐటీయూసీ అధ్యక్షులు అచ్యుతుని బాబూరావు, టి.విజరు, బి.సి.ఫెడరేషన్‌ నాయకులు వి.వెంకటేస్వర్లు, దళిత నాయకులు శీలం రవికుమార్‌ పాల్గొన్నారు.
కనిగిరి: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పిసి.కేశవరావు కోరారు. శనివారం పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి, సిపిఐఎంఎల్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో సిఐటియు నాయకులు ఎం.కొండారెడ్డి, ఎస్‌కె.ఖాదర్‌వలి, ఎస్‌కె.ఖాశీంవలి, వై.కొండల్‌రావు, సిహెచ్‌.ప్రసాద్‌, యు.పిచ్చయ్య, దేవదానం, ఏసుదాసు, ఎం.శ్రీను, మాల్యాద్రి, చార్లెస్‌, మార్క్‌, బషీరా, ప్రసన్న, చిన్నమ్మి, పద్మ, ఆదిలక్ష్మి, రమణమ్మ, సిపిఐఎంఎల్‌ జిల్లా నాయకులు పి.రమణారెడ్డి, ఏఐటియుసి నాయకులు ఎస్‌డి.యాసిన్‌, జి.బాలిరెడ్డి, జిపి.రామారావు, పి. సుబ్బారావు, పి.మోహన్‌ పాల్గొన్నారు.
కొండపి: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.జి.మస్తాన్‌ కోరారు. శనివారం సిపిఐ కార్యాలయంలో ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.జి.మస్తాన్‌ మాట్లాడుతూ 28న ప్రదర్శనలు, 29న మానహారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజా కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కోరాయి. కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు నాగరాజు, వై.చంద్రశేఖర్‌, రైతు సంఘం నాయకులు ఎన్‌.గురవయ్య, సిఐటియు నాయకులు జి.వందనం, ఐఎఫ్‌టియు నాయకులు రాజు, పివోడబ్ల్యూ మహిళా నాయకులు వై.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.