రాయచోటి టౌన్ : సివిల్ పోలీస్ సిబ్బందికి దర్బార్ పెరేడ్‌లో ఎస్‌పి హర్షవర్ధన్ రాజు సివిల్ పోలీస్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలు సుకుని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. క్రమశిక్షణ అంకితభావంతో విధులు నిర్వహించి రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా సివిల్ పోలీసుకు ప్రత్యక్ష స్థానంలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గురువారం సివిల్ పోలీస్ సిబ్బందికి దర్బార్ పెరేడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ పోలీస్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సమస్యలు ఉంటే నేరుగా తన దష్టికి తీసుకురావాలని చెప్పారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బంది విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా నిపుణులతో కోర్సులు నిర్వహిస్తున్నామని ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి సారించాలని యోగ, ధ్యానం, వ్యాయామంతో ఆరోగ్యవంతులుగా మరియు ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చని అన్నారు.










