Dec 15,2022 21:20

వైసిపి


కడప ప్రతినిధి : కడప, అన్నమయ్య జిల్లాల్లో 15 అసెంబ్లీ, రెండు పార ్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి కడప జిల్లాలోని 10 ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను వైసిపి క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలి సిందే. ఇదేతరహాలో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన 15 మండలాలు, కడప జిల్లా నుంచి 15 మండలాలు కలిపి ఏర్పడిన అన్నమయ్య జిల్లా లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపితే ఏర్పడిన ఏడింట్లోనూ వైసిపి విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య ఎత్తుకు పైఎత్తులతో టికెట్ల రాజకీయం వేడెక్కి స్తోంది.
ఏడాదికి ముందే ఎన్నికల కోళాహలం
2024 సార్వ త్రిక ఎన్నికలకు ఏడాదిన్నర్ర ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతా వరణం నెలకొంది. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో గడప గడపకూ కార్యక్రమం, బాడుదేబాదుడే, ఇదే మిఖర్మ, కౌలురైతుల పరిహారం వంటి కార్యక్రమాలతోపాటు ప్రాంతాల వారీగా సభలు, సమావేశాలు,నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వ హిస్తుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసిపి క్వీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష, పొలిటికల్‌ ప్రొఫెష నలిస్టులను నియమించుకుని ఎలాగైనా తమ అభ్యర్థుల గెలుపును దక్కించుకోవాలని ఆలోచనలతో అన్ని కోణాలను పరిశీలిస్తుండడం ఉత్కంఠను రేపుతోంది.
ఆ ముగ్గురూ అధిగమించేనా!
ప్రతి మూణ్నెళ్లకోసారి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షా నిర్వహిస్తున్నారు. గత సమీక్ష సందర్భంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి ప్రజాప్రతినిధులు గడప, గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అమలు విషయంలో వెనుకబడిన సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గడపగడపకూ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమ స్యల ను తెలుసుకుని, వాళ్ల సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. దీనికి తోడు ప్రజల్లో ఆదరణను పెంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత టికెట్లు కేటాయింపు విషయ ంలో బాధ పడకూడదని హెచ్చరించడం అందరికీ తెలిసిందే.
వైసిపిలో పెరుగుతున్న ఆశావహులు
కడప అసెంబ్లీ వైసిపి టికెట్‌ను ఐదుగురు అభ్యర్థులు ఆశి స్తున్న నేపథ్యంలో ఉత్కంఠను రేపుతోంది. కమలాపురం అభ్యర్థి మారే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాల నేపథ్యం ఆసక్తికరంగా మారింది. జమ్మలమడుగు టికెట్‌ కేటాయింపు అంశం ఉత్కంఠ రాజ్యమేలు తోంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అవమానించారనే ఉద్దేశంతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. 2024 సార త్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, మాజీమంత్రుల్లో టికెట్‌ ఎవరికి లభిస్తు ందోననే అంశం ఉత్కంఠను రేపుతోంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గడప గడపకూ ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు పరచడంలో నేతలం దరిలో ముందున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అధికార వైసిపిలో టికెట్ల కేటాయింపు వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తుండడం ఆసక్తి కరంగా మారింది.