Apr 17,2023 19:49

రికార్డులను పరిశీలిస్తున్న మేయర్‌

రికార్డులను పరిశీలిస్తున్న మేయర్‌
సచివాలయాన్ని సందర్శించిన మేయర్‌
నెల్లూరు:స్థానిక 12వ డివిజన్‌ 12/1 అల్లీపురం సచివాలయాన్ని నగరపాలక సంస్థ మేయర్‌ స్రవంతిజయవర్ధన్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను మేయర్‌ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్‌ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సూచనల మేరకు స్థానిక 12వ డివిజన్‌ 12/1 అల్లీపురం సచివాలయంను సందర్శించడం జరిగిందన్నారు. సచివాలయ పరిధిలోని ప్రజలకు పెన్షన్లు, అమ్మవడి, రేషన్‌ కార్డులు, టిడ్కో ఇళ్ళు తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, పథకాలు అందే క్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు
. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే వాటిని పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు. సమస్య ఏదైనా ఫోన్‌ ద్వారా కాని, నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా కాని తమను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్‌, షఫీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.