మాట్లాడుతున్న బాలనాగయ్య
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాలనాగయ్య తెలిపారు. మంగళ వారం యర్రగొండ పాలెంలోని సిఐటియూ కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్య క్రమంలో సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు ఎం జయలక్ష్మి, ఆశా వర్కర్ యూనియన్ మండల కార్యదర్శి తూమాటి వెంకటరమణ, సిఐటియూ మండల నాయకులు టంగుటూరి సత్యనారాయణ, భూమని వెంకటేశం, గుర్రం శ్రీను, కరుణాకర్ పాల్గొన్నారు.










