Mar 25,2022 01:36

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-కనిగిరి : కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు కోరారు. సిఐటియు పశ్చిమ ప్రకాశం ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతా గురువారం కనిగిరికి చేరింది. ఈ సందర్భంగా సిఐటియు శ్రేణుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు కాలేదన్నారు. రూ.6 లక్షల కోట్ల భారాలను ప్రజలపై మోపిందన్నారు. ఉపాధి కరువై నిరుద్యోగం పెరిగిందన్నారు. నిత్యావసరాలతోపాటు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిటియు జిల్లా కార్యదర్శి పిసి.కేశవరావు, ఎం రమేష్‌. నాయకులు ఎం కొండారెడ్డి, ఎస్‌కె ఖాదర్‌వలి,ఎస్‌కె ఖాశీంవలి, సిహెచ్‌ప్రసాద్‌, యు పిచ్చయ్య, దేవదానం,ఏసుదాసు, శ్రీను, మాల్యాద్రి, చార్లెస్‌, మార్క్‌, బషీరా, ప్రసన్న, చిన్నమ్మి, పద్మ, ఆదిలక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. కురిచేడు : ఈ నెల 28,29 తేదీలలో నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిఐటియు జిల్లా అధ్యక్షుడు డికెఎం.రఫి కోరారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన జీపుజాతా కురిచేడులో పర్యటించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెయిన్‌ బజార్‌ సెంటర్‌లో రఫి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు క్షీణించినట్లు తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని Vౖాకోర్టు తీర్పుఇచ్చినా ఎక్కడా అమలు కావడం లేదన్నారు ఈ కార్యక్ర మంలో సిఐటియు మండల నాయకుడు పఠాన్‌ రహంతుల్లా, గౌరవాధ్యక్షుడు సందు వెంకటేశ్వరరావు, కె. అశోక్‌, కె. సాల్మన్‌, డి. నాసరయ్య, కె.శాయన్న, కుమారి,