Jan 26,2023 12:55

ప్రజాశక్తి-మదనపల్లి : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె (మిట్స్) కళాశాల నందు 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. ముఖ్యంగా  దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. మన ప్రపంచంలో అనేక దేశాలలో టెక్నాలజీ పరమైన ఉద్యోగాలు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్నో ఉన్నాయని, ముక్యంగా ప్రతి ఒక్క విద్యార్ధి కూడా ఏదో ఒక ఫారీన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, తద్వారా ప్రపంచం లో ఎక్కడైనా విద్యార్థులు ఉద్యోగాలు చేయగలిగే స్థాయికి ఎదగాలని అన్నారు. డెవలప్మెంట్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ వంటి మొదలైన రంగాలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు వీటిపై ద్రుష్టి పెట్టాలని ఆయన అన్నారు. కళాశాల యెన్.సి.సి క్యాడెట్స్ చేసిన సేవలు మరియు వారు సాధించిన పథకాలు ను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్ ఆర్ ఆర్ ద్వారకనాథ్, అడ్వైసర్ బి.వి కృష్ణ రావు, అడ్వైసర్ సతీష్ హెగ్డే, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.