- లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి
ప్రజాశక్తి-పీలేరు: 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా బ్యాంక్ లింకేజీ రుణాలను ఇచ్చినట్లు ఎస్‌బిఐ లీడ్ బ్యాంక్ మేనేజరు పి. వెంకటేశన్ర రెడ్డి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శుక్రవారం పీలేరు, కెవి పల్లి, కలకడ, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి మండలాల బ్యాంక్ బ్యాంక్ మేనేజర్లు, ఏపిఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ జిల్లాఓ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,381 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు రూ.13,648 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 140 శాతం రుణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయానికి రూ.5,302 కోట్లు రుణాలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.7,878 కోట్లు ఇచ్చి 149 శాతాన్ని సాధించినట్లు చెప్పారు. ఎమ్‌ఎస్‌ఎంఇ (చిన్న, మధ్య తరహా రుణాలు)కి రూ.1,294 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.1,259 కోట్లు రుణాలుగా ఇచ్చి 97 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన రుణాలు గడువులోగా పంపిణీ చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. కొత్తవారికి రుణాలు అందించి ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ద్వారా జిల్లాలో 2,700 మందికి రుణాలు ఇవ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 30,900 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయన్నారు. వాటికి కోటూ తగినన్ని రుణాలు అందిసున్నట్లు చెప్పారు. సమావేశంలో పలు మండలాల బ్యాంక్ అధికారులు, ఎపిఎంలు పాల్గొన్నారు.










