ప్రజాశక్తి-పీలేరు: పీలేరులో ముస్లింలు ఈద్ -ఉల్ -ఫితర్ (రంజాన్) వండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లీం సోదరులు స్థానిక జెండామాను దగ్గరకు చేరుకుని, అక్కడి నుంచి సామూహికంగా అల్లాను స్తుతిస్తూ మదనపల్లి మార్గంలోని ఈద్గా మైదానం చేరుకుని, పండుగ ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హజరత్ ఇమామ్ మాట్లాడుతూ ముస్లీంలు వవిత్ర రంజాన్ నెలవంక దర్శనం తరువాతి రోజు నుంచి కఠోర ఉపవాస దీక్షలను మొదలు పెట్టి, నెల రోజుల పాటు వాటిని ఆచరిస్తూ రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కున్నారన్నారు. ముస్లీంలు తాము చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈద్ -ఉల్-ఫితర్ ఒకటని, రంజాన్ పండుగ ప్రార్థనల అనంతరం వారి శక్తి కొలదీ పేదలకు నగదు, వస్త్ర దానాలు చేసుకుంటారన్నారు. ఈ సామూహిక ప్రార్ధనలు చేయించిన మత గురువు మాట్లాడుతూ ప్రజలను ఈతి బాధలు, వేసవి ఎండల నుంచి కాపాడలిని, ప్రజలు, పశు, పక్షాదులు అంతు తెలియని వింత వ్యాధుల బారిని పడకుండా కాపాడాలని, జనాల్లో పరమత సహనాన్ని, సాటి వ్యక్తుల పట్ల ప్రేమానురాగాలని కలిగి ఉండేలా చూడాలని ప్రార్థించి వేడుకున్నారు. ప్రార్ధనల అనంతరం ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయితీ సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, జిల్లాపరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎన్ఎండి షఫి, డిసిసిబి డైరెక్టర్ స్టాంపుల మస్తాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీలేరు పట్టణ సిఐ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో ఎన్ఐ నరశింహుడు, నిబ్బంది ఈద్దా, పట్టణంలోనూ ఎక్కడా ఎలాంటి అవాంక్షనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందో నిర్వహించారు. అలాగే వాహనాల రాక పోకలను కూడా నియంత్రించి ట్రాఫిక్ సమస్యను నియంత్రించారు.










