Sep 29,2023 12:16

ప్రజాశక్తి: రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్ధివదేహాన్ని రైతు సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.