Jun 17,2023 16:12
  • గుంటకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వెంకట రమణారెడ్డి

ప్రజాశక్తి-నందలూరు: ప్రయాణికులు, ఉద్యోగుల భద్రతే రైల్వే ధ్యేయమని అందుకు కావలసిన ప్రణాళికలు రచించడమే రైల్వే ముఖ్య ఉద్దేశమని గుంటకల్ రైల్వే మేనేజర్ వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి నందలూరు రైల్వే కేంద్రంలో, రైల్వే ఉద్యోగులతో సేఫ్టీ ప్రికాషన్స్ పై సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు ప్రణాళికలు రచించాలని తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు తగిన తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిఈఎన్( కోఆర్డినేషన్) అక్కిరెడ్డి, డీఎస్ఓ చంద్రశేఖర్, డివిజనల్ సేఫ్టీ కౌన్సిలర్స్ వి ఆర్ వి నాయర్, దస్తగిరి, డి ఈ (పవర్) కృష్ణ, టి ఐ లు (హెడ్ క్వార్టర్స్) అశోక్ కుమార్, కిరణ్ కుమార్, ఎస్ఎంఆర్ కమలాకర్, ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ చంద్రశేఖర్ నాయక్, రైల్వే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.