ప్రజాశక్తి-శృంగవరపుకోట : జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మండలంలోని బొడ్డవరలో తన నివాసం నుంచి తిరుపతికి ప్రారంభించిన జయహో జగనన్న పాదయాత్ర గురువారం రెండో రోజు కొనసాగింది. పట్టణంలోని ఆర్కె ఫంక్షన్ హాల్ నుంచి రెండోరోజు ప్రారంభమైన పాదయాత్ర మండలంలోని కొత్తూరు, వెంకటరమణపేట-తిమిడి జంక్షన్, కొత్తబొద్దాం మీదుగా సాగింది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు, అభిమానులు, పాల్గొని ఎమ్మెల్సీకి సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో రఘురాజు సతీమణి, వైస్ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, ఎంపిపి సండి సోమేశ్వరరావు, జెడ్పిటిసి ఎం.వెంకటలక్ష్మి, ఎస్.కోట మేజర్ పంచాయతీ సర్పంచ్ జి.సంతోషికుమారి, తదితరులు పాల్గొన్నారు.