Oct 31,2023 23:37

రేపు శెట్టిపల్లె భూములకు ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ దశాబ్దాల కల నెరవేరింది: గ్రామస్తులు

రేపు శెట్టిపల్లె భూములకు ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌
దశాబ్దాల కల నెరవేరింది: గ్రామస్తులు

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
ఎన్నో దశాబ్దాలుగా తమ భూములకు హక్కు పై పోరాడుతున్న నేపథ్యంలో నవంబర్‌ 2న ప్రభుత్వం అధికార యంత్రాంగం రైతులకు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు ప్రోసిడింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని శెట్టిపల్లి గ్రామస్తులు బత్తెన బాబు, బాల మురళీకష్ణ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ విషయమై స్థానికంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అనుభవంలో ఉన్న భూమికి హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూములను ల్యాండ్‌ పూలింగ్‌ కింద సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీ.వో ను సైతం విడుదల చేశారన్నారు. కానీ భుసమస్యను పరిస్కరించలేక పోయారు. అయితే 2019 వైఎస్‌ఆర్సిపి అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కషి చేసారని అందుకు ఎమ్మెల్యేకి రైతులు, కొనుగోలు దారులు ప్రత్యేక కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గ్రామం కార్పొరేషన్‌లో విలీనం అయితే భూ సమస్య పరిష్కారం సులువుగా ఉంటుందని, గ్రామస్తులు దశాబ్దాలుగా రైతుల భూముల హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకొని సమస్య పరిష్కరించిన తర్వాత ఎన్నికలకు ఓట్ల కోసం గ్రామానికి వస్తానని భూమన అభినరు రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి నుంచి భూమన అభినరు రెడ్డి శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్‌, ఆర్డిఓల దష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కార్యచరణ చేశారన్నారు. భూమన అభినరు రెడ్డి చెప్పినట్టే భూ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు గ్రామస్తులు, ప్లాట్ల కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి, కుమారుడు భూమన అభినరు రెడ్డి లకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. వైసిపి పంచాయతీ ఉపసర్పంచ్‌ రామకష్ణ, గ్రామస్తులు కొనుగోలుదారులు పాల్గొన్నారు.