ప్రజాశక్తి - వంగర : ఈ ఏడాది రబీకి గొర్రెల శ్రీరాములు నాయుడు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించ లేమని మడ్డువలస ప్రాజెక్టు ఎఇ నితిన్ తెలిపారు. సాగునీరు అందించకపోతే సాగు చేసేది ఎలా అని సభ్యులు మడ్డువలస ప్రాజెక్టు అధికారులను నిలదీశారు. ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్ హాజరైన ఈ సమావేశంలో పలు శాఖలపై చర్చ జరిగింది. మడ్డువలస ప్రధాన గేటు ద్వారా నాగావళి నదిలోకి సాగునీటినీ వృధాగా విడిచిపెట్టుతున్నారు కానీ ఆయకట్టుకు నీరు ఇవ్వమని ఎందుకంటున్నారని సభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎఇ నితిన్ మాట్లాడు తూ ఎస్ఇ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలో గల నారాయణపురం ఆనకట్టుకు ఇక్కడ నుండి నీటిని విడిచి పెడుతున్నామని తెలపడంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో ఉన్న ఆనకట్టుకు ఇక్కడ నుంచి నీటిని విడిచిపెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభ్యులంతా కలిసి ఇక్కడ నుండి సాగునీరు వెళ్లకుండా నిలుపుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఎంపిపి సురేష్ ముఖర్జీ సమావేశంలో ప్రకటిం చారు. పంచాయతీరాజ్ శాఖ చర్చలో రాజుల గుమ్మడ, మడ్డువలస గ్రామాలకు చెందిన సభ్యులు మాట్లాడుతూ సిసి రోడ్లు, కాలువలకు సంబంధించిన సిమెంట్ బస్తాలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని మా గ్రామాలకు ఇవ్వవలసిన సిమెంటు ఎవరికిచ్చారని పిఆర్ జెఇని నిలదీశారు. వెంటనే ఎంపి చంద్రశేఖర్ జోక్యం చేసుకొని ఈ విషయంపై జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తమకు నివేధిక ఇవ్వాలని ఆదేశించారు. రీ సర్వే పూర్తి కాకపోవడం వల్ల వన్బిలు రాకపోవడంతో రైతులకు ఇబ్బంది జరుగుతుందని కింజంగి తలగాం ఎం సీతారాంపురం గ్రామాలకు చెందిన ప్రజాప్రతి నిధులు సభలో తెలియజేశారు. వైద్యశాఖ చర్చలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబందించి పలు వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సమావేశంలో కరణం సుదర్శన రావు, కిమిడి ఉమామహేశ్వరరావు, ఎంపిడిఒ శశిభూషణరావు, డిటి సుందరరావు, సర్పంచులు, ఎంపిటిసిలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కరువు మండలంగా తీర్మానించండి
డెంకాడ: డెంకాడను కరువు మండలంగా ప్రకటిస్తూ తీర్మానించాలని సభ్యులు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఒ నిర్మల తమ నివేదికను వినిపి స్తుండగా సభ్యులందరూ వర్షాభావ పరిస్థితి వల్ల మండలంలో వరి పంట పోయిందని రైతులందరూ నష్టపోయారని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. ఈ సమావేశానికి అధికారులు ఎక్కువ సభ్యులు తక్కువగా వచ్చారు. వచ్చిన సభ్యులు మాట్లాడుతూ మండలంలో సుమారు 5వేల ఎకరా ల్లో వరి వేశారని వర్షం లేకపోవడంతో సుమారు 3,500 ఎకరాల వరకు వరి చేను ఎండిపోయిందని తెలిపారు. కరువు మండలంగా తీర్మానం చేసి ఉన్నతాధికారు లకు పంపించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపి పిలు పిన్నింటి తమ్మి నాయుడు, కూరాకుల అనిత, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి, తహశీల్ధార్ ఆదిలక్ష్మి, సొసైటీ చైర్మన్ రొంగలి కనక సింహాచలం, బాలి సత్యనారాయణ, ఎంపి టిసిలు, సర్పంచు లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.