Jan 02,2023 21:35

ఫొటో : ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న నాయకులు

రైతుల అభ్యున్నతికే ముఖ్యమంత్రి పెద్దపీట
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల అభ్యున్నతికే పెద్దపీట వేస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేజర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో నాబార్డు నిధుల ద్వారా రైతుల సౌలభ్యం కోసం నిర్మించిన గోడౌన్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎంఎల్‌ఎ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత మండల కేంద్రానికి వచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఎంఎల్‌ఎ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం చేజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో నూతనంగా నిర్మించిన గౌడౌన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాదాన్యాత ఇస్తుందన్నారు. రైతుల సౌలభ్యం కోసం గోడౌన్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం అందజేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, గౌడౌన్ల నిర్మాణాలు సైతం రైతుల అభ్యున్నతి కోసమే చేస్తున్నారన్నారు. రైతు భరోసా, ఈ క్రాప్‌ నమోదు లాంటి పథకాల ద్వారా రైతులను వ్యవసాయంపై ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి సమగ్ర ప్రణాళిక ద్వారా చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో చేజర్ల మండల వైసిపి కన్వీనర్‌ తోమాటి విజయభాస్కర్‌ రెడ్డి, ఎంపిపి బాలిరెడ్డి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూదళ్ల వీర రాఘవరెడ్డి, తహశీల్దార్‌ విజరుకుమార్‌, ఎంపిడిఒ విజయలత, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.