తెలంగాణ: తెలంగాణ వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నల్గండ జిల్లా కంగల్‌లో 77.5మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.










