- ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్
ప్రజాశక్తిక-లికిరి : నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్మణ్ ఎంపీ వేంపల్లి నూర్జహాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పంపిణి కార్యక్రమాన్ని ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్ మరియు గుట్టపాలెం సర్పంచ్ వెంకట రెడ్డి గవర్నమెంట్ హై స్కూల్ కలికిరి నందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేవికే 4 అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ మేధోసంపత్తిని పెంచుకోవాలని ఎంఈఓ రంగనాథ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద విద్యార్థికి పాఠశాల ప్రారంభించిన మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, మూడు జతల యూనిఫాం, షూలు, సాక్షులును మండలంలోని అన్ని పాఠశాలలకు అందించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని వీటిని సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం శారద, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిఆర్పిలు సురేష్ భాస్కర, రియాజ్ లు పాల్గొనడం జరిగింది.










