చండీగఢ్ : అవినీతి కేసులో బిజెపి నేత మన్‌ప్రీత్ బాదల్‌కి పంజాబ్ విజిలెన్స్ విభాగం మంగళవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. బాదల్‌కి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు బటిండా విజిలెన్స్ విభాగం ఎస్‌ఎస్‌పి హర్పాల్ సింగ్ ధృవీకరించారు. అతనిని అరెస్ట్ చేసేందుకు తమ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయని అన్నారు. బతిండా మునిసిపాలిటీ ఆస్తుల కొనుగోలులో అవతవకలకు పాల్పడటంతో బాదల్ సహా మరో ఐదుగురిపై సోమవారం విజిలెన్స్ విభాగం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2021లో మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు విజిలెన్స్ విభాగం తెలిపింది.










