Oct 28,2023 14:39

అందోలు: ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు బిజెపి నేత బాబూమోహన్‌ తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్‌ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సఅష్టించేందుకు ప్రయత్నించారు. అర్హులకే టికెట్‌ ఇవ్వాలని బిజెపి పెద్దలను కోరుతున్నా. పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయి. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. బిజెపి జాబితాలో నా పేరు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను ఫోన్‌ చేస్తే.. కిషన్‌ రెడ్డి, బండి సంజరు లిఫ్టు చేయరు. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు'' అని బాబూమోహన్‌ తెలిపారు.