ప్రజాశక్తి - పుల్లంపేట : పుల్లంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యను అభ్యసిస్తున్న జి పల్లవి అండర్ 17 జాతీయ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి మరియు ఫిజికల్ డైరెక్టర్ బాల శేఖర్ తెలియజేశారు . ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారుల్లో పల్లవి ఆల్ రౌండ్ ప్రతిభ తో జాతీయ జట్టుకు ఎంపికైందని వారు తెలియజేశారు. త్వరలో జరగబోయే పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొననుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని ముఖ్యంగా మహిళలు క్రీడల్లో రాణించడం ఆనందించాల్సిన విషయమని జాతీయ జట్టుకు ఎంపికైన పల్లవి అక్కడ కూడా మంచిగా రానించి పాఠశాలకు జిల్లాకు మండలంకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె తెలియజేశారు. అలాగే పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారికి అన్ని విధాల శిక్షణ ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్ బాల శేఖర్ ను ఆమె అభినందించారు.










