- సీపీఐ,తెదేపా, ఏఐటీయూసి ల ఆధ్వర్యంలో "ధర్నా" మరియు "రాస్తారోఖో"
- ఆంధ్రులకు ద్రోహం చేస్తున్న బిజెపి సర్కార్
ప్రజాశక్తి-బి.కొత్తకోట : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో, ప్రయివేటీకరణను ఆపేంతవరకూ ఉద్యమం ఆగదని సీపీఐ,తెదేపా పార్టీలు స్పష్టంచేశాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న "రాస్తారోకో" కార్యక్రమాల్లో భాగంగా, బుధవారం ఉదయం 11 గంటలకు సీపీఐ,తెదేపా,ఏఐటియూ సీ ల ఆధ్వర్యంలో, బి.కొత్తకోట పట్టణంలోని స్థానిక జ్యోతీ చౌక్ నందు,"ధర్నా" మరియు "రాస్తారోకో" నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నశించాలని, ప్రయివేటీకరణపై జగన్ సర్కార్ మౌనం వీడాలని, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు,అంటూ ప్లే కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి, తెదేపా నాయకులు చావిడి.కిట్టన్నలు మాట్లాడుతూ; రాష్ట్ర,దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, మంది బలం మందబలం తో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా,దేశ ప్రజలను దగాచేసి పెను భారాలు మోపుతున్నారని విమర్శించారు. దశల వారీగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్న ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయి ముడుపులకోసం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు.దీన్ని అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతూ,ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నరేంద్రమోదీకి తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,సి పిఐ మండల కార్యదర్శి ఎస్.సలీంభాష లు మాట్లాడుతూ 32 మంది అమరవీరుల బలిదానం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో, అనేక మంది మహనీయుల పోరాటంతో సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయిన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు రాష్ట్రంలోని వైయస్ఆర్ సిపీ, టిడిపి, జనసేన పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ప్రభాకర్,కే. బాలాజీ, నాగరాజులు, సీపీఐ, ఏఐటియుసి నాయకులు ఎం.అష్రఫ్ అల్లీ, హెచ్.షమీవుల్లా, యస్.తంబయ్యశెట్టి,యస్. జవహర్ బాబు, కే.బాలకృష్ణ, గంగులప్ప, దుమ్ము.బాబు, సోము, యస్.మోదీన్ సాహెబ్, రియాజ్, హాబీబ్, ఖాసీం,యస్.గఫూర్, తదితరులు పాల్గొన్నారు.










