ప్రజాశక్తి-కలకడ : మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర సూచించారు.సోమవారం మండల కేంద్రమైన కలకడ పోలీస్ స్టేషన్ ఎదుట వాహనములను తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని నిలిపి పరిశీలించి వాహనం నడిపే డ్రైవరు మద్యం సేవించి ఉన్నాడా లేదా అని యంత్రముతో తనిఖీలు నిర్వహించి ఒకవేళ మద్యం సేవించి ఉంటే అతనికి అపరాధ రుసుము విధించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనములకు సంబంధించిన రికార్డులు, ఇన్సూరెన్స్ లు, కలిగి ఉండాలని సూచించారు, అదేవిధంగా సోమవారం వేకుజమన డ్రైవర్లు నిద్రావస్థలో ఉంటారని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డ్రైవర్లను చల్లని నీటితో ముఖం శుభ్రం చేసి వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంపించడం జరిగిందని ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, యోగేష్, శ్రీనివాసులు, ప్రతాప్, సహదేవ, మహబూబ్ బాషా, హోంగార్డ్స్ రమేష్, గురవయ్య, తదితరులు ,పాల్గొన్నారు.










