ప్రజాశక్తి-కలికిరి : ఎనిమిది మంది పేకాట రాయుల్లును అరెస్టు చేసినట్లు ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు మండలంలోని మెడికుర్తి పంచాయతీ బహుదా నది సమీపంలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు వారిపై పోలీస్ సిబ్బందితో దాడి చేయగా నలుగురు పట్టుపడగా, మిగిలిన నలుగురు పారిపోయి నట్లు ఆయన తెలిపారు. దొరికిన వారి నుండి 30 వేల 790 రూపాయలు నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని 8 మంది పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.










