ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఫోటోగ్రఫీ రంగానికి ఎన్నికల నగారా మోగింది. ఈనెల 19వ తేదీన శ్రీ అన్నమయ్య ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. వీడియో కెమెరా గుర్తుతో తుమ్మందుల పుల్లయ్య, ఫోటో కెమెరా గుర్తుతో తుమ్మలూరు సుబ్బరాయుడు లు బరిలో పోటీ పడుతున్నారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి మండలాలకు సంభందించి 198 మంది ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొని అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. శుక్రవారం అసోసియేషన్ పెద్దలు ఈనాడు స్టూడియో శీను, శ్రీకాంత్ స్టూడియో శ్రీధర్ ఫోటోగ్రఫీ కార్యాలయంలో సమావేశమై ఎన్నికలకు సంబందించిన షరతులు, పద్ధతులు, నియమాలు గురించి అభ్యర్థులకు వివరించారు. అనంతరం అభ్యర్థుల వద్ద ఆమోద పత్ర్రాలు పై సంతకాలు స్వీకరించారు. ఈ సందర్బంగా వారిరువురూ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని, అభర్థులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ స్టూడియో నిస్సార్, గణేష్ స్టూడియో నాగేంద్ర, రాయల్ స్టూడియో రమణ, దేవి స్టూడియో చంద్ర, కె.వి.ఆర్ స్టూడియో రమణ, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.










