Jun 05,2023 15:12
  • ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ 

ప్రజాశక్తి-బి.కొత్తకోట : అర్హులైన ప్రతి రైతుకు వేరుశనగ విత్తనాలు అందేటట్లు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ తెలిపారు. సోమవారం బి.కొత్తకోట పట్టణంలోని బాయ్స్ స్కూల్ నందు  ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ, మాజీ ఉప సర్పంచ్ మాలిక్, రెండో సచివాలయం కన్వీనర్ జీవీ రామకృష్ణ, ఐదవ సచివాలయం కన్వీనర్ రమేష్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు రాజేంద్ర, జ్యోతి, ఆధ్వర్యంలో  సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రత్యేక రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాలను మండలం రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ రుసుమును సకాలంలో రైతులకు అందజేసి అవసరానికి సరిపోయే విధంగా వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకుడు రాయలసీమ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.