Nov 14,2023 21:08

భోగాపురం: పథకాలు గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ

ప్రజాశక్తి- భోగాపురం : ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలే తిరిగి తమను గెలిపిస్తాయని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని సవరవల్లి సచివాలయం పరిధిలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పాడపేట, నందికపేట, రామదాసుపేట, పట్నా చిన్నయ్యపేట, వెంపాడపేట గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు. అనంతరం సచివాలయంలోని పథకాలకు సంబంధించిన డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అనూషరెడ్డి, హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి, పి వి.రమణ, వైస్‌ ఎంపిపి రావాడబాబు, నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, పడాల శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: వైసిపి ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. మంగళవారం నగర పంచాయతీ పరిధి జరజాపు పేట -1వ సచివాలయంలో సంక్షేమ పథకాల డిజిటల్‌ బోర్డును ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పి. సురేష్‌ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాల కోసం ఇబ్బందులు పడే వారని ప్రస్తుత ప్రభుత్వం అర్హులకు పథకాలు అందించడమే కాకుండా ఆయా సచివాలయాల్లో పథకాలు వివరాలు తెలుసు కోవడానికి డిజిటల్‌ రూపంలో బోర్డులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మన్‌లు సముద్రపు రామారావు, కారు కొండకృష్ణ, వైసిపి పట్టణ పార్టీ అధ్యక్షులు చిక్కాల సాంబ శివ రావు, కౌన్సిలర్లు నల్లి కృష్ణవేణి, పాండ్రంకి సత్యవతి, తుమ్ము భారతి తదితరులు పాల్గొన్నారు. కాగా తంగుడుబిల్లిలో సంక్షేమ పథకాల డిజిటల్‌ బోర్డును ఎంపిపి అంబళ్ళ సుధారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపి పతివాడ సత్య నారాయణ, సర్పంచ్‌ పి. చిన అప్పల నాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు చనమల్ల వెంకట రమణ, టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, ఎంపిడిఒ జి.రామారావు పాల్గొన్నారు.