ప్రజాశక్తి - విజయవాడ : ప్రతి జీవికీ జీవనాధారమైన ప్రకతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణా చర్యలలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వారి సూచనల ప్రకారం- విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం లక్ష్యంగా ఈనెల 7న నాలుగో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కై సందర్భంగా సోమవారం విఎంసి కార్యాలయంలో వారు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రబమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజా రెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి పాల్గొన్నారు.










