ప్రజాస్వామ్య పరిరక్షణకే టిడిపి, జనసేన పొత్తు: హరిప్రసాద్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసమే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం టిడిపి చిత్తూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ పరిశీలకుల హోదాలో బోలిశెట్టి సత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని, ఆ ఎన్నికల్లో వైసిపి నైతికంగా ఓడిపోయిందన్నారు. టిడిపి పోటీ చేసి ఉంటే వైసిపి శక్తి ఏంటో జగన్ కు అర్థమై ఉండే దన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన సమన్వయంతో పనిచేస్తే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించు కునేందుకు రెండు పార్టీల నేత లు శక్తివంచన లేకుండా కషి చేయా లన్నారు. జనసేన జిల్లా అధ్యక్షు లు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం లోకొచ్చాక మహిళలకు రక్షణ, యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. జగన్ కు అధికారం మీద ఉన్న శ్రద్ద పాలనపై లేదన్నారు. ప్రకతి వనరు లతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు కిరణ్, దినేష్, యుగంధర్, వినుత, సుభాషిని, కీర్తన, కవిత, వనజ పులివర్తి నాని, మాజీ మంత్రి అమరనాధ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, పరసారత్నం, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర డిసిప్లనరీ సభ్యులు పిఎస్ మునిరత్నం, చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పాల్గొన్నారు.










