Jan 02,2023 21:38

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాసమస్యలు పరిష్కరించాలి : సిపిఎం
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన అనంతసాగరం గ్రామసభలో సిసిఎం పార్టీ ప్రతినిధులు పాల్గొని పంచాయతీలో ఉండే సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించాలని గ్రామసర్పంచ్‌, పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌ బాషా మాట్లాడుతూ అనంతసాగరం పంచాయతీలో కొంత మందికి అనేక కారణాలతో పింఛన్లు రద్దు అయ్యాయని, రద్దు అయిన పింఛన్లు కొనసాగించాలని, జగనన్న ఇంటి స్థలాలు ఇచ్చిన వారికి అనేక కారణాలతో రద్దు చేసే ప్రయత్నం జరుగతుందన్నారు.
ఇచ్చిన ఇంటి స్థలాలు రద్దు చేయరాదని అలా చేస్తే సిపిఎం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే చిన్నలాల్‌బాగ్‌, సబ్‌ స్టేషన్‌ దగ్గర ఉండే ఎస్‌సి కాలనీ, పూసల కాలనీ, హిందూ స్కూల్‌, హై స్కూల్‌ వెనుక భాగం ఉండే వీధులలో, సంజీవనగరంలోని కొన్ని వీధులలో సిమెంట్‌ రోడ్లు వేయాలన్నారు. అలాగే కొన్ని వీధుల వారు డ్రెయినేజీ వ్యవస్థ కావాలని కోరుతున్నారన్నారు. దిగవూరు లైబ్రరీ దగ్గర ఎప్పుడు నీళ్ళు నిలబడడంతో దీని వలన దోమలు చేరి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. రాత్రులలో వైద్యం కోసం డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతసాగరం బస్టాండ్‌ సెంటర్లో ఆవుల మందలు ఎక్కువ వచ్చి కూర్చోవడం వల్ల వాహనదారులకు, దుకాణ దారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పందుల సమస్య కూడా ఎక్కువ ఉందని పెద్ద మసీదు వద్ద ఇళ్లలోకి వస్తున్నాయన్నారు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. సంజీవ నగర్‌లో ఉపాధి హామీ పనులకు వెళ్లని వారికి కూడా పని డబ్బులు పడుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మస్తాన్‌, రాటకొండ పెంచలయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు.