Apr 18,2023 20:36

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు
ప్రధాని మోడీని గద్దె దింపాలి
అనంతసాగరం:కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంగల పుల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలపై అధిక భారాలు మోపుతూ పెద్దపెద్ద కార్పొరేట్‌ శక్తులు ఉన్నటువంటి అదాని లాంటి వారికి ఊడిగం చేస్తుందన్నారు. మోడీ విధానాల వల్ల ప్రభుత్వం పూర్తిగా దెబ్బతిందన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తం నష్టాల్లో నడుస్తుందన్నారు. దేశంలో మైనార్టీలు, దళితులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
లౌకిక రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు .రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజల పైన ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, నాయకులు వేము పెంచలయ్య, సంధాని, శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.