మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు ఎస్‌కె బాబు
ప్రధాని మోడీని గద్దె దింపాలి
కోవూరు:మోడీని గద్దె దింపాలని, దేశాన్ని కాపాడుకోవాలని కోరుతూ బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై మండలంలో కొనసాగుతున్న ప్రచార భేరి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తొలుత బంగ్లాసెంటర్, పిఆర్ కాలనీ, మైధిలీహాల్ సెంటర్ ప్రాంతాల్లో ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం నాయకులు ఎస్‌కె బాబు మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు మీటర్లు పెట్టడానికి వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై అనేక రకాలుగా భారాలను మోపుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు వారికి కట్టబెడుతూ అడుగుతున్న మేధావులను ప్రజలను అణచి వేయాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో మూడు నల్ల చట్టాలను తీసుకుని వచ్చిందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 13 నెలల పాటు పోరాడి పార్లమెంట్లో రద్దు చేయించారని తెలిపారు.ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలను పిలిచి ఢిల్లీలో సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, నాయకులు శేషయ్య, రమణయ్య, ఏజ్ధానీ, బుజ్జయ్య, పెద్దన్న, మణి, హరి, సురేష్, సురేద్ర, చాన్‌బాషా, మోహన్, హసీనా, కాలేషా, ఖాదర్ బాషా, విజరు రత్నమ్మ, విజయమ్మ,పెంచలమ్మ పాల్గొన్నారు.










