Apr 17,2023 22:12

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు

పోతిరెడ్డిపాలెంలో మట్టి మాఫియా
ప్రజాశక్తి కోవూరు : మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న మట్టి మాఫియా నుండి తమ గ్రామాన్ని కాపాడాలంటూ సోమవారం ఆ గ్రామస్తులు టిడిపి నాయకులు తిరుమూరు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్‌ పద్మజకు సిఇ రామకృష్టారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు తిరుమూరు అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కోవూరు పెన్నా పరిహారిక ప్రాంతంలోని పొర్లుకట్ట గ్రామంలోని అధికార పార్టీ చెందిన నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టిని తవ్వేస్తున్నారన్నారు. నిత్యం వందల ట్రాక్టర్లతో మట్టిని ఎత్తుతున్నారని తెలియజేశారు. గ్రా
మంలో ఉన్న శ్మశానాన్ని సైతం వారి మట్టి దాహానికి బలవుతుందన్నారు. ఈ మట్టి మాఫియా నుండి తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకున్నారు. గతంలో అనేకసార్లు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, ఎంపిటిసి నాగరాజు, సూరిశెట్టి శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి తిరుమూరు రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ అంగిరేకుల కృష్ణప్రసాద్‌, జీవి నాగరాజు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.