Jan 02,2023 21:27

మాట్లాడుతున్న సిపిఐ నాయకులు

మాట్లాడుతున్న సిపిఐ నాయకులు
పెన్షన్లు రద్దు చేయడం దారుణం
ప్రజాశక్తి-నెల్లూరు :జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్లు రద్దు చేయడం దారుణం వెంటనే అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఏఐవైఎఫ్‌ నాయకులు నిరసన తెలియజేశారు. సోమవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ సిరాజ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ మున్నా మాట్లాడుతూ ప్ర్రస్తుత సిఎం ఎన్నికల ముందు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యంగా రెండు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్లు మూడు వేలు ఇస్తానని చెప్పి ఆర్భాటంగా హామీలు ఇచ్చారన్నారు
. అయితే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసలవారీగా పెంచుతూ 3 వేలు ఇస్తానని మాట ను విస్మరించి వివిధ కారణాలు చూపించి మన జిల్లా వ్యాప్తంగా వికలాంగులు, వద్ధులు, ఒంటరి మహిళలు వీళ్ళ యొక్క పదిహేను వేల పెన్షన్లు హఠాత్తుగా రద్దు చేశారన్నారు. ఈ దారుణమైన చర్యని సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం రద్దు చేసిన పెన్షన్లు మొత్తం యధావిధిగా ఇవ్వకపోతే ఎవరైతే లబ్ధిదారులతో కలిసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు గౌస్‌, ఎన్‌ మధు, సర్దార్‌, బాదుల్లా, జలీల్‌, ముత్యాలు, బాబు తదితరులు పాల్గొన్నారు