ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పైడితల్లి అమ్మవారి పండగలో చివరిఘట్టం ఉయ్యాల కంబాల కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈనేపథ్యంలో ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.పలువురు భక్తులు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు లాంతర్లు వైపు, ఎంజి రోడ్డు వైపు చలువ పందిర్లు కింద భక్తులు భారీగా క్యూ కట్టారు.