Apr 26,2023 10:50
  • ముస్లిం మైనార్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ముస్లిం మైనారిటీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తెలిపారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్తు పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం మహల్ పంచాయతీ నందు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని మళ్ళీ వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావాలని.  మన జగన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని  గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహల్ సర్పంచ్ తస్లీమా రియాజ్ అహమద్ ఖాన్, కన్వీనర్లు, గృహసారథులు యువ నాయకులు జాహిద్ భాష, సుల్తాన్, వార్డు సభ్యులు, గ్రామ వాలంటీర్ లు, కలికిరి మండల సోషల్ మీడియా కో కన్వీనర్ సాదిక్ భాష, మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.