ప్రజాశక్తి-పీలేరు: పీలేరు నుండి తిరుపతి మీదుగా చెన్నైకి సోమవారం కొత్త బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ బస్సు సర్వీస్ పీలేరులో ఉదయం 6 గంటలకు బయలుదేరి 7.30కు తిరుపతి చేరుకుంటుందని అన్నారు. తిరిగి 7.45 గంటలకు అక్కడి నుండి పుత్తూరు, పిచ్చాటూరు, నాగలాపురం, ఊతుకోట, పెరియపాలెం మీదుగా చెన్నైలోని మాధవరం బస్ స్టేషన్ కు ఉదయం 11.45 గంటలకు చేరుకుంటుందని చెప్పారు. తిరిగి చెన్నై నుండి మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి తిరుపతికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకుని, తిరుపతి నుండి 4.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు పీలేరుకు చేరుకుంటుందని తెలియజేశారు. ఈ చెన్నై బస్సు సర్వీసును పీలేరు, పరిసర గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.










