ప్రజాశక్తి-కలకడ : నజ్ముద్దీన్ రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా నిలిచాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మండల కేంద్రమైన కలకడ టమోటా మార్కెట్ యార్డ్ నందు నజ్ముద్దీన్ టమోటా మార్కెట్ ను కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో మండలములోని పలు పంచాయతీలోని రైతులు నజ్ముద్దీన్ కలిగి ఉన్న మార్కెట్ నందు టమోటాలను విక్రయించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో రైతులు వేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధరలు రావడం చేత లక్షలు సంపాదించిన రైతులు ప్రస్తుతం టమోటా పంటకు ధరలు తగ్గిపోవడంతో అప్పులు పాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటం గమనించిన నజ్ముద్దీన్ తన మార్కెట్ నందు టమోటాలు విక్రయించి నష్టాలు పాలవడం గమనించి రైతులకు ఒక్కొక్కరికి రూ .7550 నగదు రూపంలో సుమారు 41 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 41 మంది రైతులకు సుమారు రూ.3,09,550/- నగదు రూపంలో పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. మిగిలిన టమోటా మండి, ఎరువుల దుకాణాల యజమానులు నజ్ముద్దీన్ ను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టమోటా మండి యజమానులు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.










