May 12,2023 15:57

ప్రజాశక్తి-కలకడ : నేషనల్ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఈనెల 13వ తేదీ శనివారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు రకాలైన పాత కేసులను పరిష్కరించుకొనేందుకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎస్సై సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ రకాలైన ఘర్షణలు, వివిధ రకాలైన సంఘటనలతో కేసులు నమోదు చేసుకుని ఇంతవరకు పరిష్కారం కానీ కేసులను సైతం రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం అనే ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతీకారాలకు చోటు ఇవ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని స్నేహభావంతో మెలగడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కక్షలు కార్బన్యాలతో శత్రువులుగా మారడం తప్ప సమస్యలు పరిష్కారం కావని ఇందుకోసం దేశవ్యాప్తంగా కేసులను రాజీ పడేందుకు ఈ కార్యక్రమం నిర్వహించిన తెలిపారు. అనంతరం గ్రామస్తులు పోలీసు సిబ్బంది తదితరాలు కలిసి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది, మండల గ్రామీణ ప్రాంత ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.