Nov 11,2023 21:05

మధ్యలో నిలిచిపోయిన పనులు

ప్రజాశక్తి - వేపాడ :  నాడు నేడు రెండో విడత అదనపు భవనాల నిర్మాణపు పనులు మద్యలో నిలిచిపోయాయి. దీంతో పాఠశాలల విద్యార్థులు గదులు చాలాక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మద్యలోనే నిలిపివేసినట్లు చెబుతున్నారు. దీంతో ఎప్పటి మాదిరిగానే విద్యార్థులు చాలీచాలని ఇరుకు గదుల్లో చదువులు వెళ్లదీయాల్సి వస్తుంది. ప్రభుత్వం విద్యకు వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటనలో చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది.
ముఖ్యంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, దొంగాడ ఎంపిపి పాఠశాల, కేజీబీవీ వసతి గృహం, వావిలపాడు జిల్లా పరిషత్‌ పాఠశాల, సోంపురం జిల్లా పరిషత్‌ పాఠశాలల్తో అదనపు గదుల నిర్మాణపు పనులు మద్యలో నిలిచిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అదనపు గదులకు అవసరమైన నిధులను విడుదల చేసి పనులు పూర్తి చేస్తే తప్ప ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశాలు లేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.