చెక్కు అందజేస్తున్న ఎంఎల్‌ఎ ప్రసన్న
నెరవేరిన కోవూరు ప్రెస్ క్లబ్ కల
కోవూరు :20 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల కల నెరవేర పోతుంది కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతో కోవూరు తాలూకా ప్రాంగణంలో మంగళవారం ప్రెస్ క్లబ్‌కు శంకుస్థాపన జరిగింది. ఎంఎల్‌ఎ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ శంకుస్థాపనకు తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష యాభై వేల రూపాయలు నగదు విరాళం అందజేశారు. మొదటి అంతస్తు గాను నలుబోలు వీర రాఘవరెడ్డి పేరున కుమారుడు నలుబోలు సుబ్బారెడ్డి నిర్మాణానికి తాను నిధులు అందజేస్తామన్నారు.కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, రాష్ట్ర వ్యవసాయ సహాయక మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఎఎంసి చైర్మన్ పచ్చిపల రాధాకష్ణారెడ్డి,్డ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, కోవూరు సిఐ రామకష్ణారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ పద్మజ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు, జర్నలిస్టులు పెద్ది సాయిబాబు, కోటపూరి మధు, రమేష్, స్వర్ణరాము, అనిల్, తదితరులు పాల్గొన్నారు.










