Jan 14,2023 14:51

ప్రజాశక్తి-నందలూరు : క్రీడలు ఆడడం ద్వారా ఆత్మవిశ్వాసం తో పాటు శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉంటారని కావున ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేత మాడపూరి హేమలత అన్నారు. శనివారం మండల జడ్పీ క్రీడా మైదానంలో ప్రముఖ విద్యావేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తోపాటు క్రీడాకారులకు మెమెంటోలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ సమ్మెట శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చమర్తి జగన్ రాజు ద్వారా నిర్వహిస్తారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య అకాడమీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ డైరెక్టర్లు ఏనుగుల బాలాంజనేయులు, సమ్మెట ఉమామహేష్, టిడిపి నాయకులు తోట శివశంకర్, కొండశెట్టి సుదర్శన్, ఆర్గనైజర్లు పల్లె గ్రీష్మంత్ రెడ్డి, మాడపూరి శ్రీరాములు, దొమ్మరాజు మోహన్ రాజు, లీలాకృష్ణయ్య, మహేష్, శివకోటి,మున్నా, హరికృష్ణ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.