ప్రజాశక్తి - బి.కొత్తకోట : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం మొరుసు కాపురెడ్లు (వక్కలిగర) కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మొరుసు కాపు వ్యవస్తాపక అధ్యక్షులు కోగర మద్దిరెడ్డి మాట్లాడుతూ మొరుసు కాపులందరూ ఐక్యతతో ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.అనంతరం మొరుసుకాపు నాయకుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ జీవో 33 అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాలవుతున్నా బీసీ-బి సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యా పరంగా,ఉద్యోగాల పరంగా,ప్రభుత్వ పథకాల పరంగా ఎంతో నష్టపోయామని తెలిపారు.వేపూరికోట ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్ద పట్టణమైన బి.కొత్తకోటలో వక్కలిగర కల్యాణ మండపం నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు.గౌనివారి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మొరుసు కాపుల ఐక్యమత్యత చాలా అవసరమన తెలిపారు.దయ్యాలపల్లి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మన హక్కుల కోసం ప్రతి మొరుసు కాపు రెడ్డి ముందరికి రావాలని చెప్పారు.యర్రమద్దు కేశవరెడ్డి మాట్లాడుతూ మొరుసుకాపుల ఐక్యతే మన ధ్యేయమన్నారు.చివరగా బొంతల మధుకర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ-బి సర్టిఫికెట్లతో మన మొరుసుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా ఉపయోగమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆది శేఖర్ రెడ్డి,శెట్టిపల్లి వెంకటరమణా రెడ్డి,కృష్ణా రెడ్డి,గొందిపల్లి బయ్యా రెడ్డి,తరుగు శివారెడ్డి,చిన్నపరెడ్డి,మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










