ప్రజాశక్తి-కలకడ: మోడల్ స్కూల్ అందరికీ మోడల్ గా ఉందని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను ఇండ్ల వద్ద చదవడానికి వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబులు పంపిణీ చేసి విద్యను సులభతరం చేసేందుకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సుమారు ఐదులక్షల 18 వేల టాబ్లను పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ట్యాబు 14 వేలు నుండి 15 వేలు వరకు ఉంటుందని ఈ ట్యాబులను విద్యార్థులు ఉపాధ్యాయులు పరిపూర్ణంగా వినియోగించుకుని పాఠ్యాంశాలను అంశాలను క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పనులకు ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు రుణపడి ఉన్నారని కొనియాడారు. రాష్ట్రంలో నాడు- నేడు క్రింద పాఠశాలలకు మహర్దశ తెప్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. మన లక్ష్యం మన గోల్ చేరేందుకు ఈ ట్యాబులు ఎంతో విద్యార్థులకు దోహదపడతాయని వాటిని సద్విని చేసుకుని పరిపూర్ణంగా విద్యను అభ్యసించే విధంగా ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్, కలికిరి మార్కెటింగ్ యాడ్ కమిటీ చైర్మన్ రవి కుమార్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, మోడల్ పాఠశాల కమిటీ చైర్మన్ మస్తాన్ అహ్మద్, సర్పంచులు రాజగోపాల్ రెడ్డి, ప్యారి జాన్ షావతలి ,ఎం










